12 April, 2026 | 1:56 AM

ప్యారడైజ్ నుంచి సుబ్బలక్ష్మివచ్చింది!

12-04-2026 12:00 AM

స్టార్ హీరో నాని నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, సంపూర్ణేశ్‌బాబు మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం ప్రతి పాత్ర రివల్‌తో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ మేకర్స్ ఈ చిత్రం నుంచి హీరోయిన్ కయాదు లోహర్ పాత్రను పరిచయం చేశారు. శనివారం కయాదు పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆమెను సుబ్బలక్ష్మి (సుబ్బు)గా పరిచయం చేశారు.

సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ కయాదు పాత్ర ఈ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సీహెచ్ సాయి, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.