calender_icon.png 12 July, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వించేందుకు సిద్ధమైన సుబ్రమణ్యం

29-07-2024 12:05:00 AM

రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలి వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ, అజయ్, అన్న పూర్ణమ్మ, ప్రవీణ్, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 23న విడదల కానుంది. ఈ క్రమం లో సినిమా ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆవిష్కరించారు హీరో రామచరణ్. సుబ్రమణ్యం పాత్రలో ఎటకారాన్ని అలంకారంగా ధరించిన రావు రమేష్ “ ‘పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోం ది” అని పొరిగింటాయన అడిగిన ప్రశ్నకు “గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను” అని బదులిచ్చారు. ట్రైలర్‌లో ఇలాంటి సంభాషణలను తనదైన శైలిలో పలికి అందరినీ నవ్విస్తున్న ఆయన, సినిమాతో తెలుగు నాట ప్రేక్షకులందరినీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వారు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.