calender_icon.png 20 June, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్ యూనివర్సిటీలో సక్సెస్ మీట్

08-06-2025 12:00:00 AM

  1. ప్లేస్మెంట్‌లో 1200 మందికి ఉద్యోగాలు
  2. రూ.51 లక్షల ప్యాకేజీతో అత్యధిక జీతం

వరంగల్, జూన్ 6: విద్యార్థుల ఉద్యోగ విజయాలను పురస్కరించుకుంటూ ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం గ్రాండ్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం పరిశ్రమలతో ఉన్న బలమైన అనుసంధానాన్ని, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన శిక్షణను, కెరీర్ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను ప్రతిబింబించింది.

చాన్స్‌లర్ ఏ వరధరెడ్డి  మాట్లాడుతూ.. ఈ విజయాలు పరిశ్రమ అవసరాలను గుర్తిం చి, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించిన ఫలితంగా సాధ్యమయ్యాయని చెప్పారు. వారి ఆసక్తులను ప్రోత్సహిస్తూ అన్ని కోణాల్లో వారి ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ విజయాల్లో కీలకంగా పనిచేసిన డీన్లు, శాఖాధిపతులు, డైరెక్టర్లు, ప్లేస్మెంట్ సమన్వయకర్తలు అందరిని అభినందించారు.

వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. ప్లేస్మెంట్ విజయాలతో పాటు, విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించేందుకు అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తాము ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నా రు. ఎస్‌ఆర్‌ఐ ఇంక్యూబేషన్ కేంద్రంద్వారా విద్యార్థుల స్టార్టప్ ఆలోచనలకు సీడ్ ఫండింగ్ ద్వారా మద్దతు అందిస్తున్నామని వెల్లడించారు. అసోసియేట్ డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ జి సునీల్‌రెడ్డి ప్లేస్మెంట్ నివేదికను సమర్పించారు.

ఈ సంవత్సరం 1200 మంది కి పైగా విద్యార్థులు వివిధ ప్రఖ్యాత సంస్థలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు. ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్, సర్వీస్నౌ, పేపాల్, ఫ్లిప్కార్ట్ నీవ్, ష్ట్న్రడర్ ఎలక్ట్రిక్, ఇన్ఫోసిస్, కాప్జెమిని, యాక్సెంచర్, కాగ్నిజెంట్, హ్యూండాయ్, బోష్, టోషిబా, టెక్ మహీంద్రా వంటి ప్రఖ్యా త మల్టీనేషనల్ సంస్థలు ఉన్నాయి.

విద్యార్థు లు అందుకున్న అత్యధిక జీత ప్యాకేజీలు ప్రధా న ఆకర్షణగా నిలిచాయి. వార్షికంగా రూ.51 లక్షలు, రూ.44 లక్షలు, రూ.34.4 లక్షలు లభించడం విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పించడంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

ఈ సందర్భంగా విద్యార్థులను చాన్స్‌లర్ వరధరెడ్డి, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్‌గార్గ్, రిజి స్ట్రార్ డాక్టర్ ఆర్ అర్చనారెడ్డి అభినందన పత్రాలు, ఆఫర్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొ. వీ మహేష్, విద్యా ర్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.