విజయవంతమైన నిపుణుల సదస్సు
ఎస్‌ఐఈటీ, ఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహణ
ఇబ్రహీంపట్నం, జూన్ 30 (విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్‌ఐఈటీ), ఇబ్రహీంపట్నంలోని ఇనిస్టిట్యూషన్ ఇన్నో వేషన్ కౌన్సిల్ (ఐఐసీ) ఆధ్వర్యంలో ‘బిజినెస్ మోడల్ కానా ్వస్ (బీఎంసీ) అండ్ బిజినెస్ మోడల్ ఫిట్’ అం శంపై నిపుణుల సదస్సు విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ నిపుణులు అజుమ్ గిల్లెడ్‌మండా ముఖ్య వక్తగా పాల్గొని తొమ్మిది కీలక అంశాలు, విలువ ప్రతిపాదన, కస్టమర్ సెగ్మెంట్లు, ఆదాయ వనరులు, వ్యయ నిర్మాణం, తదితరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డాక్టర్ పి. శేఖర్‌బాబు, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఈటీ అధ్యక్ష త వహించగా, జి. భగత్, డైరెక్టర్, డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, సెక్రటరీ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. డాక్టర్ కందే శ్రీనివాస్, ఐఐసీ కోఆర్డినేటర్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, నిపుణులతో జరిగిన ప్రశ్నోత్తరాల ద్వారా వ్యాపార నమూనాల రూపకల్పనపై విలువైన అవగాహన పొందారు.






