గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 30: గ్రామాల సమగ్రాభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు.జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేలు,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దరూరి యోగానందచార్యుల సౌజన్యంతో ఉపాధి హామీ నిధులు రూ.15 లక్షలతో నిర్మించే డ్రైనేజీ కెనాల్,సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,ఉపసర్పంచ్ కమటం స్వర్ణలతరాజు,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి,వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






