29 July, 2026 | 7:58 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

సూడాన్ వ్యక్తికి ఎబోలా లక్షణాలు

05-06-2026 12:00 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్.. అలర్ట్

గాంధీ ఆసుపత్రికి తరలింపు

ముషీరాబాద్/రాజేంద్రనగర్, జూన్ 4 (విజయక్రాంతి): శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హి స్టరీ ఉన్నట్టు గుర్తించారు. గురువారం సూడాన్ నుంచి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మహ్మద్ అనే ప్రయాణికుడికి ఎయిర్ పోర్టులో ప్రభు త్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు.

ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్టు గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. అతన్ని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపిం చినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ మధ్య ఆఫ్రికా దేశా ల్లో వేగంగా విస్తరిస్తుంది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది.