3 September, 2026 | 1:50 AM

ఎస్వీఎం కన్వీనర్‌గా సుధాకర్‌శర్మ

03-09-2026 | 12:10am

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): స్వదేశీ జాగరణ్ మంచ్ స్ఫూర్తి(Swadeshi Jagran Manch Sphoorti,)తో ఏర్పాటైన స్వదేశీ వ్యాపారి మంచ్ (ఎస్వీఎం) తెలంగాణ కన్వీనర్‌గా ధాడిగం రామ్ సుధాకర్ శర్మ(Dhadigam Ram Sudhakar Sharma) నియమితులయ్యారు.  సుబోధ్ గు ప్తాను తెలంగాణ టీమ్(Telangana team)--11 సభ్యుడిగా నియమించారు. భోపాల్‌లోని ఎంపీ సైన్స్ ఆడి టోరియంలో ఆగస్టు 30, 31 తేదీల్లో జరిగిన ఎస్వీఎం జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భార త సంఘటక్ కాశ్మీర్ లాల్, అఖిల భారత స హ సంఘటక్ సతీష్ కుమార్, ఎస్వీఎం అఖి ల భారత కన్వీనర్ బాలకృష్ణ భార్తియా తదితరులు పాల్గొన్నారు. మనోహర్ లాల్ అగ ర్వాల్ సదస్సుకు అధ్యక్షత వహించి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ నుంచి ధాడిగం రా మ్ సుధాకర్‌శర్మ, సుబోధ్‌గుప్తా, వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.ప్రసాద్‌రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. డి.ప్రసాద్‌రెడ్డి ఏపీ ఎస్వీఎం కన్వీనర్‌గా, మురళీమోహన్ టీమ్-11 సభ్యుడిగా నియమితులయ్యారు.