3 September, 2026 | 1:26 AM

6న చలో హైదరాబాద్

03-09-2026 | 12:00am

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల సంకల్ప సభ

ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల పెండింగ్(Telangana Employees Pending) సమస్యల పరిష్కారం, పీఆర్సీ, డీఏల సాధన కోసం ఈ నెల 6న హైదరాబాద్‌(Hyderabad)లో నిర్వహించనున్న ఉద్యోగుల సంకల్ప సభ(Employees Resolve Meeting)ను జ యప్రదం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(Telangana Employees JAC)  పిలుపునిచ్చింది. చలో హైదరాబాద్ కార్యక్రమం(Chalo Hyderabad Program,)లో భాగంగా 6వ తేదీన మధ్యా హ్నం 2 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఉద్యోగుల సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి జే ఏసీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను సాధించడంతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు. ఉద్యోగుల ఐక్యతను చాటుతూ సంకల్ప సభను విజయవంతం చేయాలన్నారు.