15 March, 2026 | 8:28 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

21-06-2025 12:00 AM

అదిలాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి) :  ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ వేయడం కలకలం రేపింది. ఇచ్చోడ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన అరుణ్ పై గతంలో ఫోక్సో కేసు నమోదు అయింది. ఐతే కోర్టు విచారణకు నిందితుడు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్  వారెంట్ జారీ అయ్యింది.

దింతో పరారీలో ఉన్న నిం దితుడు శుక్రవారం బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాడన్న సమాచారంతో నిందితు న్ని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా నిందితుడు అరుణ్ తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరి స్తూ కాసేపు హల్ చల్ చేసాడు.

పోలీసులు అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించగా తన వద్ద బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గొంతు పై ఉన్న చర్మం కొద్దిగా దిగడంతో రక్తస్రావం అయింది. వెంటనే పోలీసులు నిందితున్ని ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలో సైతం నిందితుడు  బ్లేడుతో హల్చల్ చేశారని సీఐ తెలిపారు.