ఉరి వేసుకుని ఒకరి ఆత్మహత్య
03-03-2026 12:00 AM
కుబీర్, మార్చి 2 (విజయక్రాంతి): మండలంలోని పల్సి గ్రామానికి చెందిన పెద్దకాపు శివలింగు (56) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శివలింగు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయింది.
దీంతో సోమవారం ఉదయం తన చేనుకు వెళ్లాడు. అక్కడే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా అనంతరం మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.






