5 April, 2026 | 4:21 AM

కొలువు రాలేదని ఆత్మహత్య

05-04-2026 12:21 AM

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

చిట్యాల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఉన్నత చదువులు చదివినా, ఆశించిన కొలువు దక్కలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి తనువు చాలించిన ఘటన నార్కట్‌పల్లి మండల కేంద్ర సమీపంలో శనివారం జరిగింది.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్‌రెడ్డి ఉన్నత  చదువులు పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయి లో ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన హరీష్‌రెడ్డి నార్కట్‌పల్లి శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.