calender_icon.png 5 February, 2026 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

05-02-2026 01:06:55 AM

ఉత్తరప్రదేశ్‌లో ఘటన

లక్నో, ఫిబ్రవరి 4 : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని తమ నివాస భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల(12, 14, 16) ఆత్మహత్యకు మొదట్లో ఒక గుర్తు తెలియని కొరియన్ టాస్క్-బేస్డ్ గేమింగ్ యాప్ కారణమని భా వించిన పోలీసులు, తర్వాత దాన్ని తోసిపుచ్చారు.

బాధితులు తమ డైరీలో కేదూ వినోదం ద్వారా ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ‘సారీ పాపా, నేను చాలా ఒంటరిగా ఉన్నాను’ అంటూ వారు రాసిన చివరి మాటలు అందరినీ కలిచివేస్తున్నాయి.ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది.  ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చేతన్ కుమార్ కుటుంబం నివసి స్తోంది. ఇతడికి ఇద్దరు భార్యలు. చేతన్ మొదటి భార్యకు మొదట్లో పిల్లలు పుట్టకపోవడంతో ఆమె సోదరినే పెళ్లి చేసుకున్నాడు.

ఈమెకు ముగ్గురు పిల్లలు పుట్టాక, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వీరందరూ కలిసి నివసిస్తున్నారు. బాధితులైన ముగ్గురిలో, ఒకరు మొదటి భార్య కుమార్తె, మిగతా ఇద్దరు రెండో భార్య కుమార్తెలు. ఈ ముగ్గురు బాలికలు రెండు మూడేళ్లుగా స్కూలుకు కూడా వెళ్లకుండా నిరంతరం ఫోన్లలోనే గడిపేవారు. కొరియన్ సిరీస్‌లు చూడటం, ఆ పాటలు వినడం వారికి వ్యసనంగా మారింది.

చివరకు తల్లిదండ్రులు వారి ఫోన్లను లాక్కుని, కే కల్చర్‌కు దూరంగా ఉండాలని మందలించడంతో వారు.. ఆత్మహత్య చేసుకున్నన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామ నిపోలీసు ఎస్పీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు పోలీసులు తెలిపారు.

ఏంటీ ‘కొరియన్ వేవ్’?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘కొరియన్ వేవ్’ లేదా ‘హల్యు’ అనే ట్రెండ్ యువతను చుట్టేస్తోంది. కే- వినోదాన్ని మాత్రమే కాకుండా, ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రాల్లో కనిపించే అందమైన నటులు, రంగులమయమైన జీవితాలు, భావోద్వేగభరితమైన సంగీతం టీనేజర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇతర దేశాల సంస్కృతితో పోలిస్తే, కొరియన్ కంటెంట్ చాలా ఆకర్షణీయంగా, ఫాంటసీ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తోంది. ఎంతోమంది యువతీ యువకులు తమ వాస్తవ జీవితాన్ని మర్చిపోయి, ఆ గ్లామర్ ప్రపంచమే నిజమని నమ్ముతున్నారు.