calender_icon.png 8 February, 2026 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిపించండి... పాలకుడిగా కాదు... సేవకుడిలా పని చేస్తా...

08-02-2026 06:25:10 PM

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ద తిరుపతి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుండి కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇవ్వండి పాలకుడిగా కాదు సేవకుడిగా మీ మధ్య ఉంటూ పని చేస్తానని సిద్ధ తిరుపతి ఓటర్లను వేడుకుంటున్నారు. ఆదివారం తన వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో వార్డు పరిధిలోని అన్ని సమస్యలు పరిష్కరించడంతోపాటు, అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని సిద్ధ తిరుపతి ఇంటింటా తిరుగుతూ ఓటర్ల కు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్ దేవుళ్లనువేడుకుంటున్నారు.