calender_icon.png 19 May, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ లో విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

19-05-2025 08:03:21 PM

చర్ల (విజయక్రాంతి): గత నెల 26వ తేదీ నుండి స్థానిక రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ సందర్బంగా కళాభవన్ లో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చర్ల ఎస్ఐ నర్సిరెడ్డి, కేశవరావు పాల్గొని మాట్లాడుతూ... ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు వేసవి సెలవులలో  శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి కంప్యూటర్స్, క్రికెట్, కుట్టు శిక్షణ వంటి పలు విభాగాలలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమన్నారు.

వ్యయ ప్రయాసలకు ఓర్చి రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం యాజమాన్యం నిజంగా ఆదర్శనీయమన్నారు, రాహుల్ విజ్ఞాన్ వ్యవస్థాపకులు డాక్టర్ డి.ఎన్ కుమార్ అభినందించారు. అనంతరం వేసవి సెలవుల ఉచిత శిక్షణ శిబిరం ముగింపు సందర్బంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ జూనియర్, సీనియర్ విజేతలకు ట్రోఫీని బహుకరించి, శిక్షణ పొందిన సర్టిఫికెట్ లను అందజేశారు.

అనంతరం రాహుల్ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు వర్మరాజు మాట్లాడుతూ... ఈ వేసవి సెలవుల ఉచిత శిక్షణ శిబిరంలో క్రికెట్ విభాగంలో 84 మంది విద్యార్థులు ప్రాధమిక అంశాలలో శిక్షణ పొందగా, కంప్యూటర్ విభాగం ఎమ్ఎస్ ఆఫీస్లో 132 మంది, అలాగే కుట్టు మిషన్ విభాగంలో 30 మంది శిక్షణ తీసుకొని దాదాపు 250 మంది విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంను వినియోగించుకున్నారన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ ఎం.వి. ఎల్ నరసింహారావు, భారతి, బి.క్రాంతి కుమార్, ఎస్.కె ఉస్మాన్,ఎ. బోసు బాబు, కె. ప్రదీప్, డి.రాజా, డి.లావణ్య, స్థానిక క్రీడాకారులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.