15-08-2025 10:38:54 PM
పెన్ పహాడ్: మండల బిజెపి ఆధ్వర్యంలో 79వ పాంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు తాళ్లపల్లి మధు జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాతీయ పెంపొందించుకోవాలని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ప్రపంచానికి భారతదేశ సౌబ్రాతృత్వం చాటి చెప్పాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం సంతోషకరమన్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంటి ముందు జాతీయ జెండా ఎగరవేయడం...పిలుపునందుకొని మోడీ అడుగు జాడల్లో నడవడం అభినందనీయమన్నారు.