calender_icon.png 19 May, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూరిజం మేనేజ్మెంట్ లో నిమ్మల రాజేష్ కు డాక్టరేట్ ప్రదానం..

19-05-2025 08:11:15 PM

హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం టూరిజం మేనేజ్మెంట్(Kakatiya University Tourism Management) పరిశోధకులు నిమ్మల రాజేష్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. హిస్టారికల్ మోనుమేంట్స్ ఇన్ నార్త్ తెలంగాణ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ టూరిజం- ఏ స్టడీ అనే అంశంపై టూరిజం మేనేజ్మెంట్ అండ్ హిస్టరీ ఆచార్యులు తక్కళ్ళపల్లి దయాకర్ రావు పర్యవేక్షణలో పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినందుకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కేయూ పరిక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాజేష్ తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబమైన నిమ్మల వెంకటేశ్వర్లు-అరుణ దంపతులకు జన్మించారు. స్వయంశక్తితో, పట్టుదలతో చదువుకోని గ్రామంలోనే డాక్టరేట్ పట్టా పొందిన మొదటి వ్యక్తి కావడం విశేషం. అంతేకాదు గత 15 సంవత్సరాలుగా ఎబివిపిలో పనిచేస్తూ జాతీయవాద సిద్దాంతాన్ని విద్యార్థుల్లో పెంపోదిస్తూ దేశంకోసం ధర్మం కోసం సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న రాజేష్ ను ఈ  సందర్భంగా ఆ విభాగం అధ్యాపకులు, పరిశోధకులు, కంఠాయపాలెం గ్రామస్తులు అభినందించారు.