15-08-2025 10:36:16 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సాజిద్ అలీ,తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దార్ శ్వేత, పోలీస్ స్టేషన్లో ఎస్సై మురళి, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ కపిల్ రెడ్డి,మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆవరణలో జెండాలను ఎగరేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ అందర్నీ ఆకట్టుకుంది. పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రతినిధులు బహుమతులు అందించారు.