calender_icon.png 16 August, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షర విద్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

15-08-2025 10:33:53 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ  మండల కేంద్రంలో అక్షర విద్యాలయం లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో కోలాహలంగా నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ కృష్ణ భగవానుని చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వేడుకలకు శ్రీ వాసవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కృష్ణ భగవానుడు, రాధా, గోపికల వేషధారనలతో విచ్చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అధ్యాపక బృందం శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన వివిధ కథలను పురాణాలను విద్యార్థులకు వివరించారు. ఆ తర్వాత విద్యార్థులచే ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.