18 July, 2026 | 10:25 AM

మొదటి చంద్రకిరణాలా? సీతాకోకచిలుక నవ్వులా!

30-11-2024 12:00 AM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వరుస అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. దీంతో పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు,cతో నెట్టిల్లు అదిరిపోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఈ సాంగ్ మలయాళంలో ఉంది. దీంతో కొంత తెలుగు ఆడియన్స్‌కు అర్థం కావడంలేదు. ఇది గమనించిన అల్లు అర్జున్ దీని గురించి ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. ఈ పాట తెలుగు అర్థం అందులో ఉంది. ‘ఇది కామధేవుని బాణమా, లేదా నీ కంటి బాణమా?.. ఇవి మొదటి చంద్ర కిరణాలా, లేక సీతాకోకచిలుక నవ్వులా?.. ఇవి అందమైన మల్లెపూల మూరలా, లేదా నీ అందమైన పెదవులా?.. ఇవి తేనె కోసం వెతుకుతున్న తేనెటీగలా, లేక నీ కోరికల ముక్కలా?..’ అని గీత సాహిత్యంలోని అర్థాన్ని సంగీత ప్రియులు ఆస్వాదిం చేందుకు ఇలా అవకాశం ఇచ్చారు ఐకాన్ స్టార్. ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారిందిప్పుడు.