7 July, 2026 | 2:10 AM

మానసిక విశ్రాంతి కోసమే..

18-05-2024 01:28 AM

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై దిగ్గజ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ స్పందించాడు. తన రిటైర్‌మెంట్‌కు ఫిట్‌నెస్ కారణం కాదని కేవలం మానసిక విశ్రాంతి కోసమే ఆటకు గుడ్‌బై చెప్పినట్లు ఛెత్రీ తెలిపాడు. ‘శారీరకంగా ఫిట్‌గా లేనందునే ఛెత్రీ రిటైర్‌మెంట్ ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి. నిజానికి నేను ఫిట్‌నెస్ కారణంగా ఆటకు వీడ్కోలు పలకలేదు. ఇప్పటికీ నేను ఫిట్‌గానే ఉన్నా. వేగంగా పరిగెత్తగలను, బంతిని చేజ్ చేయగలను, ఢిపెండింగ్ ఆడగలను. కష్టం ముందు ఫిట్‌నెస్ ఏమాత్రం పనికిరాదు. ఎంత ఫిట్‌గా ఉన్న విశ్రాంతి కోసం ఏదో ఒక రోజు ఆట నుంచి తప్పుకోవాల్సిందే. రిటైర్‌మెంట్  నిర్ణయమై కొన్ని రోజులుగా తటపటాయించాను. ఏడాది పాటు బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. ఇక నా రిటైర్‌మెంట్‌ను ప్రకటించడానికి ముందు మిత్రుడు విరాట్ కోహ్లీతో చర్చించా. అతడు నాకు చాలా దగ్గరి స్నేహితుడు. నా పరిస్థితిని అతడికి పూర్తిగా వివరించా. ఎందుకంటే మా ఇద్దరికి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. నా నిర్ణయం చెప్పిన వెంటనే కోహ్లీ స్వాగతించాడు’ అని చెప్పుకొచ్చాడు.