7 July, 2026 | 1:16 AM

పర్వీన్‌పై సస్పెన్షన్

18-05-2024 01:31 AM

న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఏడాదిన్నర పాటు నిషేధం విధించింది. 12 నెలల వ్యవధిలో తన షెడ్యూల్, డోపింగ్ టెస్టుల వివరాలను అందించకపోవడంతో పర్వీన్‌పై వేటు వేసినట్లు వాడా తెలిపింది. దీంతో పర్వీన్ రూపంలో భారత్ ఒక ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. పర్వీన్ సస్పెన్షన్‌పై వాడా స్పందిస్తూ.. ‘గత ఏడాది ఎప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు పర్వీన్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం ప్రతీ బాక్సర్‌కు ఏడాదిలో మూడుసార్లు డోపింగ్ టెస్టుల వివరాలు అందించే అవకాశమిస్తాం. కానీ పర్వీన్ ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 మధ్య తన వివరాలను ఒక్కసారి కూడా వెల్లడించలేదు. దీంతో 22 నెలల పాటు ఏ టోర్నీలో పాల్గొనకుండా వేటు వేశాం’ అని తెలిపింది.