7 July, 2026 | 3:03 AM

సెమీస్‌లో అశ్విని జోడీ

18-05-2024 01:24 AM

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లరు సత్తాచాటారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప క్రాస్టో జంట సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ వారిని అనుసరించింది. బీడబ్ల్యూఎప్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం అశ్విని ద్వయం 21 21 21 ఆరో సీడ్ లీ యూ లిమ్ చాన్ జోడీపై విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో అశ్విని జోడీ.. కీలక సమయాల్లో పాయింట్లు సాధించి ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ ద్వయం 21 21 జునేద్ ఆరిఫ్ కింగ్ జంటపై గెలుపొందింది. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో సాత్విక్ ద్వయం ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో మీరాబా లువాంగ్ 12 5  విదిత్‌సర్న్ చేతిలో పరాజయం పాలయ్యాడు.