13-11-2025 12:00:00 AM
దేశంలోనే మొదటిసారిగా దక్కిన గౌరవం
వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తాం:- డాక్టర్ గురవారెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): వైద్యరంగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కిమ్స్ గ్రూప్ అగ్రగామిగా ముందుకు సాగుతోందని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్‌రావు తెలిపారు. కిమ్స్ సన్‌షైన్‌లో భాగమైన సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు జాయింట్ రీప్లేస్మెంట్ భాగంలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎవి గురవారెడ్డి తెలిపారు. బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌లో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా మెడికల్ పరికరాలను అంద జేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన స్ట్రైకర్ కంపనీ మ్యాకో రోబోతో (రోబోటిక్ అసిస్టెడ్) జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు పది వేలకు పైగా శస్త్రచికిత్సలను నిర్వహించడం, హాస్పిటాలిటీ, రీసెర్చ్ పేపర్లు అందజేయడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ను అందజేసినట్లు స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రసిడెంట్, జనరల్ మేనేజర్ అమన్ రిషి తెలిపారు.
డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్ట్రైకర్ కంపెనీ వారు సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇండియా హెల్త్ టూరిజంలో ముందుకు దూసుకువెళ్తుందని, అందులో హైదరాబాద్ మరింత ముందుండటం గొప్ప విషయంగా తెలిపారు. ఈ అవార్డు అందుకోవడంతో మరిం త బాధ్యత పెరిగిందని, రీసెర్చ్ మరింత ముందుకు వెళ్లడంతో పాటు పేషెంట్స్ కు మరింత ఖచ్చితమైన, నాణ్యమైన వైద్యసేవలను అందిస్తామని తెలిపారు.
రోబోటిక్ అసిస్టెంట్ శస్త్రచికిత్సల వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ కుషాల్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.