3 July, 2026 | 10:44 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సూపర్ హిట్ జోడీ

24-11-2024 01:12 AM

రాంచీ, నవంబర్ 23: మనీలాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2024లో గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆమె తాజా ఎన్నికల్లో భర్తకు అండగా నిలిచి పార్టీ విజయం కోసం విశేష కృషి చేశారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్‌తో కలిసి ఆమె దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు.  క్రమంలోనే వారి జంట ‘బంటీ ఔర్ బబ్లీగా’ ప్రజల్లో గుర్తింపు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీ విమర్శలు తిప్పి కొడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు.