31 July, 2026 | 10:53 AM

3 నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

28-05-2024 02:02 AM

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): జూన్ 3 నుంచి టెన్త్ అడ్వా న్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు తెలిపిం ది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 9.30  నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. సైన్స్ మాత్రం రెండు భాగాలుగా వేర్వేరు రోజుల్లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలకు ఉదయం 11గంట ల వరకే సమయం కేటాయించారు. ఇక 31,625 మంది బాలురు, 19,612 మంది బాలికలు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో పొందుపరి చినట్లు   పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 

టీజీగా ఉండాలి

రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారడంతో అందుకనుగుణంగా విద్యాశాఖ చేసే ఉత్తర్వుల్లో టీజీగా మార్పులు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.