ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు
28-05-2024 01:17 PM
హైదరాబాద్: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ప్రజాభవన్ లో బాంబు ఉందని ఓ దుండగుడు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ప్రజాభవన్ లో కాసేపట్లో బాంబు పేలిపోతుంది అంటూ ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం. ప్రజా భవన్ ఆవరణలో ఉన్న నివాస భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారిక నివాస గృహంగా ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.






