బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌కు మద్దతు

27-04-2024 01:47:48 AM

సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

పెద్దపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): మతతత్వ పార్టీ బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి స్పష్టంచేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  మోదీ కార్పొరేట్‌శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయర మణారావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సీపీఐ నేతలు చిలివెరి శంకర్, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు.