calender_icon.png 14 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల వైద్య సేవలకు సహకారం

12-05-2025 01:14:25 AM

ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ 

వారసిగుడ, మే 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 20 రోగులకు దాదాపు రూ.7 లక్షల విలువజేసే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను, ఏడుగురు  రోగులకు  రూ.9.90  లక్షల విలువజేసె లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను చెక్కులను సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాల యంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం అందించారు.

ఈ సందర్భంగా మా ట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారం గా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు  తమ వంతు సహకారాన్ని అందిస్తు న్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. కార్పొరేటర్లు  సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, రాసురి సునీత, నాయకులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారాసిగుడాకు చెందిన గట్టు లక్ష్మికి రూ.రెండు లక్షలు,  అబెదా బేగం కు రూ.లక్ష,  చిలకలగుడాకు చెందిన గఫార్ కు రూ.1.50 లక్షలు, అబ్దుల్ షోయెబ్ కు రూ.లక్ష, పార్సిగుట్టకు చెందిన  వనమాల వాణి కి రూ.1.50 లక్షలు, శాంతీ నగర్ కు చెందిన మజర్ ఫాతిమా కు రూ.రెండు లక్షల విలువజేసీ, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్ కు చెందిన బెజ్జల సురేష్ కు రూ.90 వేల  ఎల్.ఓ.సీ. పత్రాలను ఈ సందర్భంగా అందించారు. నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందేందుకు వీలుగా ఈ పత్రాలను అందించామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.