17 April, 2026 | 9:19 PM

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

17-04-2026 07:42 PM

జనసేన విద్యార్థి విభాగం ఓయూ అధ్యక్షుడు వినోద్ నాయక్

దేవరకొండ,(విజయక్రాంతి): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అని జనసేన విద్యార్థి విభాగం ఓయూ అధ్యక్షుడు వినోద్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ లో  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి అని సబ్ రిజిస్ట్రార్  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎండ తీవ్రత అధికంగా ఉన్నా కార్యాలయంలో ప్రజలకు కనీస మంచినీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యాలయం లోపల ప్రజలు వేచి ఉండాల్సిన చోట ఉద్యోగులు తమ వాహనాలను (బైక్లను) పార్క్ చేయడం వల్ల సామాన్య ప్రజలు, వృద్ధులు ఎండలో బయట నిలబడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల వాహనాల పార్కింగ్: ఆఫీస్ లోపల ఉద్యోగుల బైక్ పార్కింగ్‌ను తక్షణమే నిలిపివేసి, ఆ స్థలాన్ని ప్రజలకు కేటాయించాలి. వాహనాలను బయట పార్క్ చేయాలి.చల్లటి మంచినీరు: పెరుగుతున్న ఎండ దృష్ట్యా కార్యాలయంలో వాటర్ కూలర్లు ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు కనీస వసతులు: వెయిటింగ్ హాల్‌లో ఫ్యాన్లు, కూలర్లు కార్యాలయం బయట చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. కోరారు  లేనిపక్షంలో జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.