దేశంలో బీజేపీకి ఆదరణ పెరిగింది
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, ఆగస్టు 19 (విజయక్రాంతి): దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసం పెరగడం వలన బిజెపికి ఆదరణ లభిస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే, బీ జే ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణానికి చెందిన మున్నూరు కాపు మిత్ర మండలి వ్యవస్థాపన అధ్యక్షులు అడప పోశెట్టి తో పాటు ముఖ్య నాయకులు, యువకులుకిషన్, అశోక్ వర్మ, మనోహర్ వర్మ,ఆనంద్,యువరాజ్ ,సాయి ,ఆధుముల్ల నర్సయ్య,,కందుల రాజేందర్ ,
వేణు తో పాటు 30 మందికి పైగా యువకులు/నాయకులు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి కండువాలను ఎమ్మెల్యే వేసి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, బీజేపీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ కందుల హరీష్, మాజీ కౌన్సిలర్ లు పోడెల్లి గణేష్, అకోజి కిశన్, నాయకులు డి శ్రీనివాస్, కొండాజి శ్రావణ్, గురిజాల రాజు,వేణు, ప్రమోద్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.






