తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ కృషి వల్లనే రాష్ట్రం ఏర్పాటు.
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోని అమ్మ పాత్ర ఎంతగానో ఉందని ఆమె కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమనం అయిందని బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి ఎంతగానో ఉందన్నారు.
ఇంకా ప్రభుత్వం గొప్పలకు పోయి అప్పులు చేసిందని విమర్శించారు ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం పంపిణీ పంట కొనుగోలు కార్యక్రమాలను రైతులకు పేదల కోసం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి మల్లేష్ వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి డైరెక్టర్లు యూనస్ భోజన మునేశ్వర్ మాత్రం నగేష్ నారాయణ విజయ్ నందకుమార్ పొన్నాల సెమిందర్ రెడ్డి శేఖర్ పలు రైతులు పాల్గొన్నారు.






