calender_icon.png 6 May, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర

25-04-2025 05:03:40 PM

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్...

మంథని (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని అధ్వర్యంలో మండలంలోని పోతారం, మల్లెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ... రైతులు అరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు విక్రయించరాదని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి గ్రేడ్ ఏ కు రూ.2320, సాధారణ రకానికి రూ. 2300మద్దతు ధర పొందాలని సూచించారు.

ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సహకార సంఘం ద్వారా 35 కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దేవళ్ల విజయ్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రూ రమ-సురేష్ రెడ్డి, నాయకులు జాగిరి సదానందం, ఎరుకల మధు, ఎడ్డ ప్రమీల, తాళ్ళపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.