3 August, 2026 | 5:54 PM

ప్రజాస్వామ్య పరిరక్షణకు సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపాలి

03-09-2025 12:00 AM

సుదర్శన్‌రెడ్డి మద్దతు సమావేశంలో వక్తలు 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు పలకాలని సుదర్శన్ రెడ్డి మద్దతు సమావేశంలో భక్తుల తెలిపా రు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యావంతులు, మేధావులు, జర్నలి స్టులు, ప్రముఖ సామాజిక కార్యకర్తల నుం చి సేకరించిన సంతకాల పత్రాన్ని ప్రముఖ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం విడుదల చేశారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ: ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాకుండా భారతదేశ భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల నిలకడపై జరుగుతున్న ఎన్నిక అన్నారు. దేశంలో పౌరుల హక్కులు బలహీనమవుతున్న ఈ సమయంలో, ఈ ఎన్నిక దేశ ముఖచిత్రానికి దిక్సూచిగా నిలవాలని సూ చించారు. రాజ్యాంగ విలువలను కాపాడే శక్తులు ఒకవైపు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒకవైపు ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మీ మీ పరిధులను దాటి ముందుకు రావాలి.

ఈ ఎన్ని కలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.ఇప్పటివరకు విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తదితరులు 155 మంది సంతకాలు చేసినట్లు తెలిపారు. ఈ సంఖ్య త్వరలో మరింత పెరుగుతుందని అన్నారు.సుదర్శన్ రెడ్డిని హోం శాఖ మంత్రి అమిత్ షా అర్బన్ నక్సలైట్ అని పిలవడం తగదన్నారు.

రాజకీ యాలకు అతీతంగా మమతా బెనర్జీ, కేజ్రీవా ల్ తదితరులు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించారని తెలిపారు. పాశం యాదగిరి మా ట్లాడుతూఅన్ని వర్గాల ప్రజలు సుదర్శన్ రెడ్డి కి మద్దతు తెలుపుతున్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వ్యక్తి సుదర్శన్‌రెడ్డి అని తెలిపారు. రాజ్యాంగంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒ క్కరు ఆయనకు మద్దతు పలకాలని కోరారు.