రైతులకు సరిపడా యూరియా అందించాలని రాస్తారోకో
నకిరేకల్ సెప్టెంబర్ 2: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచి పంట పొలా లను రక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ తిప్పర్తి రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలన్నారు. యూరియా కోసం రైతులు డీలర్ల వద్ద, సహకార సంఘాల వద్ద రాత్రి, తెల్లవారుజాము నుండే క్యూలైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రైతులకు నిలబడే ఓపిక లేక లైన్లో పాస్ పుస్తకాలు , చెప్పులు ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అరకొరగా యూరియా రావడం వలన రైతులకు అందరికీ అందక నిరాశ చెందుత్తు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్, చెన్న బోయిన నాగమణి, ఒంటెపాక కృష్ణ, పాలడుగు పరమేష్, కొప్పుల అంజయ్య, జిల్లా ఉపేందర్, షాబాద్ బిక్షం రెడ్డి, పన్నాల శశికళ, గాధగోని అంజయ్య, రామచంద్రయ్య, భూపతి వెంకన్న, పరమప్ప తదితరులు పాల్గొన్నారు






