calender_icon.png 6 October, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట.. పిటిషన్ కొట్టివేత

06-10-2025 01:12:11 PM

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సోమవారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ దవేలతో చర్చలు జరిపారు. కాగా, సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ జరిగింది. 

సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు(BC reservations) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకుకు వచ్చామని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు స్టే.. ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని సుప్రీం ప్రశ్నించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశంపై అనుకూలమైన తీర్పు వస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్తామని ఆయన వివరించారు.