ఆసుపత్రులలో వైద్యుల రక్షణకు.. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణ కు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మంగళవారం ఆర్జకర్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ హత్యా చారం కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో దారణం జరిగేంతవరకు దేశం వేచి చూడలేదని, డాక్టర్ల రక్షణ కు సంబంధించి మరిన్ని ఏర్పాట్లు అవసరమని పేర్కొన్నారు. ఆర్జీ కర్ వైద్యురాలి ఘటనను రాజకీయ వివాదంగా చేయదల్చు కోలేదని సీజేఐ తెలిపారు. హత్యాచారం ఘటనకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు బలగాలతో అణచివేసే ప్రయత్నం చేయొద్దంటూ పశ్చిమ బెంగాల్ సర్కార్‌కు సూచించింది.
టాస్క్ ఫోర్స్ లో.. ఎవరెవరు ఉంటారు ?
ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరైన్ నాయకత్వం వహిస్తారని సుప్రీం కోర్టు తెలిపింది. డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, పల్లవి సప్రే, పద్మ శ్రీవత్సవ, సభ్యులుగా ఉంటారు. టాస్క్ ఫోర్స్ కు ఎక్స్ అఫీషియో మెంబర్లు గా కేంద్ర కేబినెట్ సెక్రెట్రీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్య దర్శి, నేషనల్ మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ గా ఉంటారని సప్రీం కోర్ట్ వెల్లడించింది. మూడు నెలల్లో మధ్యంతర నివేదిక అంద జేయాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించింది.






