25 May, 2026 | 3:31 AM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

20-08-2024 01:07 PM

హైదరాబాద్: నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ను పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి వినతిపత్రం అందించారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందించడంతో పాటు పలు సమస్యలను విన్నవించారు. తన నియోజకవర్గంలో గల 5 డివిజనులు, ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు, ఒక మండలం ఉన్నాయని సీఎంకు వివరించారు. శంషాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. శంషాబాద్ మండలం 111 జీవో కారణంగా నిధుల లేమితో అభివృద్ధి కుంటుపడిదని ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గండిపేట్ మండలంలో జూనియర్ కాలేజీ లేని కారణంగా విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి ఫీజులు కట్టలేకపోతున్నారని గండిపేట మండలానికి ఒక జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు.