19-01-2026 01:39:01 PM
న్యూఢిల్లీ: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad)కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో నోటీసులు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. స్పీకర్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేటీఆర్ పిటిషన్ తో ఏలేటి పిటిషన్ ను సుప్రీంకోర్టు(Supreme Court) జతచేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సవాల్ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు సుప్రీం వాయిదా వేసింది.