వివాహం పవిత్ర క్రతువు
04-05-2024 12:05 AM
హైందవ వివాహ క్రతువు ఆసాంతం అత్యంత పవిత్రమైంది. నూతన దంపతులు అగ్ని సాక్షిగా వేసే ఏడు అడుగులకు వున్న విలువ, గొప్పతనాన్ని వేద విజ్ఞానం ఏనాడో చెప్పింది. దీనిని కొందరు ఆధునికులే అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇదే దురదృష్టకరం. సుప్రీంకోర్టు ఒక విడాకుల కేసు విషయంలో ‘సప్తపది’, ‘మాంగల్య ధారణ’ కార్యాలు జరపకపోతే సదరు వివాహం చట్టబద్ధం కాదని ఇటీవల ఇచ్చిన తీర్పు అభినందనీయం. దీనికి సంబంధించి నేటి ‘విజయక్రాంతి’ సంపాదకీయం ప్రశంసనీయం. అలాగే, పెళ్ళిళ్లలో అనవసరమైన ఆర్భాటాలను తగ్గించుకొని శాస్త్రో్ర్తక్తంగా జరగవలసిన కార్యాలపట్ల శ్రద్ధ చూపాలంటూ చేసిన హితబోధను ప్రత్యేకించి యువతరం అవగాహన చేసుకోవాలి.
సహస్ర, మశీద్‌బండ రోడ్, కొండాపూర్






