18 April, 2026 | 3:12 PM

దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

18-04-2026 01:47 PM

కుల గణన ఒక అబద్దాల పుట్ట

రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి.                                     

హనుమకొండ,(విజయక్రాంతి): దళిత క్రిస్టియన్స్ కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన తెలిపాలనీ, కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని  మాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు, రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో వెలువడక ముందే సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో నిండు శాసన సభలో  ప్రకటించి, సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకంగా,అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేశారని గుర్తు చేశారు. 

దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఇచ్చి, 20 రోజులు గడిచిన సీఎం నిర్ణయం తీసుకోకపోవడం, మౌనం వెనుక ఉన్న ఆంత్యర్యం ఏమిటని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బహుశా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, గైడ్ లైన్స్ కు తేడా తెలియడం లేదామో!?అని అనుమానం వ్యక్తం చేశారు. ముందుగా మత ప్రతి పాదికగ లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ బండి అశోక్ మాట్లాడుతూ మాదిగలు, రెడ్లు ఒకటేనని చెప్పుకున్న రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తూ మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇటీవల 2026లో ప్రకటించిన జనాభా లెక్కల్లో మాదిగలు 36 లక్షలు చూపించారు, అదేవిధంగా మాలలు 14 లక్షలు ఉన్నట్లుగా చూపించాడు. అంటే  మాదిగల జనాభా పెరిగిందనీ చూపిన రేవంత్ రెడ్డి, మాలల జనాభాను 2011 కంటే మూడు లక్షలు తక్కువ చేసి చూపించడం ఇది మాలలపై కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో  పెద్ద మాదిగనని చెప్పుకున్న దళిత ద్రోహి నారాచంద్రబాబు నాయుడు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగలేనని గ్రహించిన రేవంత్ రెడ్డి ముందస్తుగా మాదిగల ఓటు బ్యాంకు కోసం వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో  మాల సంఘాల జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోకన్వినర్లు శేషాద్రి నాగులు, వంగేటి రాజమౌళి, దండ్రే శ్రీనివాస్, పోతుల కొమ్మలు, సాదు కుమారస్వామి, అశోక్,కట్ట బాబు, తదితరులు పాల్గొన్నారు.