10-12-2025 01:47:56 PM
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలోని రాజ్ టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో బుధవారం తెల్లవారుజామున ఆకస్మాత్ గా మంటలు అంటుకున్నాయి. దీనితో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు బహుళ అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్ని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భవనం పైరెండు అంతస్తుల్లో పోగ దట్టంగా అలుముకుంది. మార్కెట్ చాలావరకు ఖాళీగా ఉన్న సమయంలో ఈ మంటలు చెలరేగడంతో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. కానీ వస్త్ర పరిశ్రమ కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.