calender_icon.png 10 December, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాలలో వ్యూహానికి ప్రతి వ్యూహం

10-12-2025 12:09:07 PM

కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం.

ఇద్దరి వైపు యువకుల మద్దతు..

ఎక్కడికక్కడే ఓటర్లకు సెటిల్మెంట్లు, విందులు.

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సర్పంచ్ స్థానానికి తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వ్యూహానికి బిఆర్ఎస్ అభ్యర్థి ప్రతి వ్యూహాన్ని రచిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ బలంతో ముందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థి యువకులు,అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

వెంకట్రావుపల్లి(సీ) నుంచి  వన్ సైడ్ గా ఓట్ల కోసం కృషి చేస్తున్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా మరోవైపు ఇద్దరు అభ్యర్థులు ఉదయం నుంచే డీ అంటే డీ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి వైపు గ్రాఫ్ సమానంగా  నడుస్తుండగా ఎక్కడికక్కడే యువకులకు, ప్రజలకు సెటిల్మెంట్లు,విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియవస్తోంది.ఇద్దరు అభ్యర్థులు గెలుపు నాదంటే నాది అంటూ బయట చర్చించుకోవడం ప్రస్తుతానికి చర్చనీ అంశంగా మారుతుండగా గెలుపు డంకా ఎవరు మోగిస్తారో వేచి చూడాల్సి ఉంది.