calender_icon.png 4 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలి

04-02-2026 02:03:57 AM

వకీల్‌పల్లి మైన్స్ ఉద్యోగులతో మాత్రమే నింపాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

మంథని, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): వకీల్ పల్లి మైన్స్‌లో ఆర్జీ-2లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను వకీల్ పల్లి మైన్ ఉద్యోగులతో మాత్రమే నింపాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మేనేజర్‌కి ఏఐటీయూసీ నేతలు తదితరులు మెమోరాండం అందజేశారు. అన్ని ఏరియాల ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ కొత్తగా ఇచ్చిన సర్క్యులర్‌ని రద్దు చేయాలని, పై క్యాటగిరిలో పనిచేసే ఉద్యోగులకు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కి వస్తే బేసిక్ ప్రొటెక్షన్ కల్పించాలని, స్టాచుటరి ట్రైనింగ్ చేసిన ఉద్యోగులకు రికవరీ చేసిన జీతాలు వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

సత్తుపల్లిలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను కొత్తగూడెం డివిజన్ వాళ్లతో నింపడానికి సర్కులర్ ఇచ్చిన యాజమాన్యం అర్జీ-2 లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను సింగరేణిలోని అన్ని ఏరియాల నుంచి నింపడానికి సర్కులర్ ఇవ్వడాన్ని  ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. గతంలో మాదిరిగా అర్జీ-2 లోని అర్హత గల కార్మికులతోనే ఆర్జీ2 లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలు నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి అన్నారావు, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మామిడి మహేందర్, బొట్ల సంపత్, పిట్ కార్యదర్శి బొంత రాజు,నాయకులు వెంకటేష్, నరేష్, భూమయ్య, రాకేష్ , నాగరాజు, శ్యాం, అజయ్, అభినవ్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.