calender_icon.png 4 February, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ అధ్యక్షుడెవరు?

04-02-2026 02:02:44 AM

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుని ఎన్నికలో ఎడతెగని సందిగ్ధత 

కుదరని ఏకాభిప్రాయం 

స్వపక్షంలో అసమ్మతి రాగం 

మానకొండూరు, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మానకొండూరు మండల నూతన సర్పంచులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల పైబడి గడిచినా మండల సర్పం చ్ ల ఫోరం అధ్యక్షుని ఎన్నికపై  సందిగ్ధత వీడలేదు. మండలంలో 29 సర్పంచ్ స్థానాలకు గాను బీ ఆర్‌ఎస్ 11, భాజపా రెండు, కాంగ్రెస్ 16 స్థానాలను కైవసం చేసుకున్నా రు. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ ముం దంజలో ఉండటంతో అధ్యక్షుని స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికినీ కాంగ్రెస్ సర్పంచ్ ల మధ్య కొనసాగుతున్న అసమ్మతి రాగంతో వెనుకడుగు వేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. అధ్యక్ష పదవి కాంగ్రెస్ కైవసం చేసుకున్నా ఉపాధ్యక్షు లు, ప్రధాన కార్యదర్శి, తదితర స్థానాలు భా రాస పార్టీ సర్పంచులకు కేటాయించి, సమన్యాయం చేసే పరిస్థితులు కరువై సయోధ్య కుదరక అధ్యక్షుని ఎన్నికపై నీలి నీడలు క మ్ముకున్నాయి.

అసలు అధ్యక్ష ఎన్నికపై సర్పంచులకు సమాచారం ఇచ్చి ఎన్నికపై చర్చ లు జరిపినా, సర్పంచ్ ల మధ్య సయోధ్య కుదరక ఎన్నిక వాయిదా పడింది. మరో రెం డు సార్లు అసలు భారాస సర్పంచులను సమావేశాలకు సైతం ఆహ్వానించకపోవడంతో మండలంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని సభ్యు లందరికీ సమాచారం ఇచ్చి, పార్టీల కతీతంగా అధ్యక్షుని ఎన్నిక జరపాల్సిన తరుణం లో కొందరు సర్పంచులు ఏకపక్షంగా సమావేశం నిర్వహించి అధ్యక్షు స్థానానికి ఎన్నికై నట్లు ఫ్లెక్సీలు ముద్రించి మానకొండూరు గ్రామ ప్రధాన కూడలిలో ప్రదర్శించడంతో వైరి వర్గ సర్పంచులకు ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఏకాభిప్రాయం కుదరక ఏ ఏ స్థానాల్లో ఎవరెవకి కేటాయించాలో, ఉపాధ్యక్ష, ప్రధా న కార్యదర్శి స్థానాల్లో ఎవరిని నియమించాలో ఏకాభిప్రాయం రాకుండా, కుదరకుం డా కొంతమంది అడ్డు తగులుతున్నారనే వాదనలు లేకపోలేదు. భాజపా, సభ్యులు బీఆర్‌ఎస్ సర్పంచులకు మద్దతు పలకడం బహిరంగ రహస్యమే. మెజారిటీ స్థానాలు అధికార పార్టీకి చెందిన సర్పంచులు ఉండడంతో భారాస, భాజపా సర్పంచులను కాద నుకొని ఏకపక్షంగా అధ్యక్ష పదవికి కోసం కసరత్తు చేసీ పలు వ్యూహాలు రచించారనే వాదనలు తెరపైకి వచ్చాయి.

సర్పంచుల ఫోరం అంటే పార్టీలకతీతంగా మెజారిటీ సర్పంచుల ఆమోదంతో ఎన్నిక జరపాలనీ, వీలు కాకపోతే మరో కుంపటి పెట్టి అధికార పార్టీ బల నిరూపణ చేసి అధ్యక్ష స్థానం ఎ న్నుకుంటే మేము సైతం తగ్గేదే లేదని, మా వ్యూహాలు మాకున్నాయి, అంటూ భారాస సర్పంచ్ లు  ఒకతాటిపైకి వచ్చి ఐక్యంగా వే చి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారనే వాదన లు వినిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నిక సజావుగా సాగుతుందా, బేషజాలకు వెళ్లి మరిం త సమస్య జటిలమై, కాలయాపన కొనసాగుతుందా, విషయం బహిర్గతం అవ్వడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు, రాజకీయ పరిణామాలు, అంశాలు మండలంలో ఆసక్తికర చర్చకు తెర తీశాయి.