calender_icon.png 20 December, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదిరిందయ్యా ప్రసాదు!

20-12-2025 01:59:35 AM

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వినోదం పంచేందుకు ‘మన శంకరవర ప్రసాద్ గారు’తో వస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా, విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. డిసెంబర్ చివరి వారంలో మూడో పాట కూడా విడుదల కానుంది. అంతకన్నా ముందే మేకర్స్ తాజాగా కొన్ని ఫొటోల తో మెగాస్టార్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

‘మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్’ పేరుతో మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ఫొటోలు మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్‌లో చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, ఆకట్టుకునే చరిస్మాతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ అప్పీల్, మ్యాజికల్ స్క్రీన్‌ప్రెజెన్స్‌ను మరోసారి చాటారు. ఆయన వింటేజ్ చార్మ్, నేచురల్ గ్రేస్ ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. 2026, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.