17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యాదాద్రి కొండపై ఆకస్మిక తనిఖీలు

02-06-2025 12:48 AM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్ 

యాదాద్రి భువనగిరి జూన్ 1 ( విజయ క్రాంతి): యాదగిరిగుట్ట కార్యనిర్వాహణాధికారి వెంకట్రావు దేవస్థాన వివిధ విభాగాలను తనిఖీ చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు.    గోశాల  తనిఖీ  చేసి రికార్డులు పరిశీలించారు  గోమాతలకు ఇవ్వబడుచున్న దానా, గోగ్రాసము నాణ్యత పరిశీలించారు. కొండ క్రింద లక్ష్మి పుష్కరి నందు నీరు పరిశుభ్రముగా లేనందున పచ్చగా ఉన్నందున సదరు నిర్వహణ అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్ ను విధుల నుండి సస్పెండ్ చేయమని సంబంధిత విభాగము అధికారులను ఆదేశించారు.

కొండక్రింద అద్దె గదులు తనిఖీ చేసి కొన్ని గదులలో ప్లాస్టరింగ్, వాటర్ లేకేజి సమస్యలు ఉండగా వెంటనే ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి మారమ్మత్తులు చేయించవలసినదిగా ఆదేశించారు. కొండక్రింద పారిశుధ్య పనులు పరిశీలించి అక్కడక్కడా అపరిశుభ్రముగా యుండగా ఫోన్లో సంబంధిత అధికారులను మందలించారు  కొండపైన మాడవీదులు, క్యూ  లైన్స్ పరిశీలించారు క్యూ కాంప్లెక్స్ లో  మంచి నీటి సదుపాయము ఫ్యాన్స్, ac పని తీరు పరిశీలించారు. క్యూ కాంప్లెక్స్లో  భక్తులతో చర్చించారు. కళ్యాణ కట్ట పరిశీలించారు.