13 June, 2026 | 10:17 PM

వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి

13-06-2026 09:08 PM

హద్దులు తేల్చాలి.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లిలోనే వేశ్యకాంతల చెరువు తామర చెరువు అదేవిధంగా బేతిపల్లి చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఈ చెరువులన్నింటినీ సర్వే నిర్వహించి వాటి హద్దులు తేల్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో ఐబి ఈఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఈ కార్యాలయం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దండు ఆదినారాయణ మాట్లాడుతూ వేశ్యకాంతుల చెరువు తామర చెరువు బేతపల్లి చెరువు ఇంకా ఎన్టీఆర్ కెనాల్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు భరణిపాడు వరకు ఆక్రమణలకు గురయ్యాయి.

అట్టి భూములు తీసి పేదలకు పంపిణీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు వీటితోపాటు కాకర్లపల్లి రేజర్ల సత్యనారాయణపురం గంగారం చెరువు శిఖం భూములు అన్యక్రాంతమయ్యాయని వీటిని వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించి మిగులు భూములు పేదలకు పంచాలని వీటితోపాటు బేతుపల్లి చెరువు కళంగి భూమి 7:30 ఎకరాలు ఉండగా దానిని కొందరు ఆక్రమించి పట్టా పాస్బుక్కులు పొందారని వాటిని కూడా సర్వే చేయాలనీ ఆయనడిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమించి పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.