13 June, 2026 | 10:17 PM

కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

13-06-2026 09:13 PM

కల్లూరు,(విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన దోసపాటి సుజాత కుటుంబానికి కల్లూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రూ.65,000 ఆర్థిక సాయం అందజేశారు.దోసపాటి సర్వేశ్వరరావు భార్య సుజాత ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులు వెంటనే స్పందించి విరాళాలు సేకరించారు. కల్లూరు మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు అనుమోలు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.

ఈ సందర్భంగా పసుమర్తి చందర్రావు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న స్వసమాజ బాంధవులను ఆదుకోవడంలో కల్లూరు మండల కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని కొనియాడారు. మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు దోసపాటి కృష్ణార్జునరావు, దోసపాటి శ్రీనివాసరావు, నాళ్ల శ్రీనివాసరావు, రాచమళ్ళ నాగేశ్వరరావు, పసుమర్తి రాంబాబు, సముద్రాల పుల్లారావు, మిట్టపల్లి రాఘవరావు, చారుగుండ్ల సందీప్, జల్లా యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.