14 July, 2026 | 11:23 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

లయన్స్ క్లబ్ ఆఫ్ అపూర్వ నూతన అధ్యక్షుడిగా డా.ఇఎస్.సూర్యనారాయణ

30-06-2025 11:19 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ డిస్ట్రిక్ట్ 320ఎ, రిజియన్ 7, జోన్ 2, లయన్ స్టిక్ ఇయర్ 2025- నూతన అధ్యక్షునిగా సమాజ సేవకులు కళాపోషకులు లయన్ డాక్టర్ ఇఎస్.సూర్యనారాయణను సోమవారం జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ అపూర్వ(Lions Club of Apoorva) అధ్యక్ష ఎన్నికల్లో లయన్ టి. నైనదేవి ఎం.జె.ఎఫ్.రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, అపూర్వ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్, లయన్ వై.సుధాకర్ రావు, క్లబ్ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో క్లబ్ నూతన అధ్యక్షునిగా లయన్ డా.ఇ.ఎస్.సూర్యనారాయణను కార్యదర్శిగా లయన్ డా.ఎల్.మహేష్‌ను, ట్రెజరర్‌గా, లయన్ టి.నైనదేవిని, ఎం.జె.ఎఫ్. ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికై ఈ కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జూలై 6న లయన్స్ భవన్, సికింద్రాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎ, గవర్నర్ లయన్ డా.జి.మహేందర్ కుమార్ రెడ్డి, పి.ఎం.జె.ఎన్, ఇండక్షన్ ఆఫీసర్ గా లయన్ వైవి.రామచంద్రరావు, పి.ఎం.జె.ఎఫ్, ప్రత్యేక అతిథిగా సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ హజరు కానున్నట్లు చెప్పారు.