01-07-2025 12:00:00 AM
- ఇరువైపులా పిచ్చిమొక్కలు
- చెత్త, మట్టితో నిండిన
- జాతీయ రహదారి పట్టించుకోని అధికారులు
అశ్వారావుపేట, జూన్ 30 (విజయ క్రాంతి) : మున్సిపాల్టీ గా ఆవిర్భవించిన ని యోజక కేంద్రమైన అశ్వారావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన అభివృ ద్ధి పనులు ప్రభుత్వం మారి ఏడాదిన్నర దా టిన సాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి లో భాగంగానే తల్లాడ _దేవరపల్లి జాతీయ రహదారిలోని పట్టణం లోని సత్తుపల్లి, జంగారె డ్డిగూడెం రోడ్డులో డివైడర్, సెంటర్ లైటింగ్, ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు.
డ్రైనేజ్ నిర్మాణం కొనసాగుతుంది. డివైడర్ పనులు పూర్తి చేశారు. డివైడర్ మ ద్యలో అందమైన మొక్కలు పెంచేందుకు మ ట్టి కూడా పోశారు. సెంటర్ లైటింగ్ కోసం స్తంభాలు తెచ్చారు కానీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. డివైడర్ మధ్య లో సుందరంగా ఉండేందుకు పెంచాల్సిన మొక్కలు సంగతి దేవుడెరుగు. వాటి స్థానం లో పిచ్చి మొక్క లు, జిల్లేడు చెట్లు పెరుగుతున్నాయి. జాతీ య రహదారి అధికారులు గానీ, స్థానిక ఆర్ అండ్ బి అధికారులు గాని, పట్టణాన్ని శు భ్రం చేసే మున్సిపల్ అధికారులు తొలిగించి, శుభ్రం చేయాలనే విషయాన్ని గాలికి వదిలారు.
జాతీయ ర హదారి అథారిటీ కార్యాలయం కూడా స్థానికంగా లేకపోవటం, రహ దారి గురించి పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివైడర్ కు ఇరు వైపుల భారీగా మట్టి పేరుకుపోయి అక్కడ కూ డా పిచ్చి మొక్కలు పెరిగి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ సిబ్బంది మట్టి తొలగించటం లేదు .దీంతో ముందు భారీ వాహనాలు, లారీలు, బస్సు లు వెళుతున్నప్పుడు వాటి వెనకాల ద్విచక్ర వాహన దారుల కళ్లలో దుమ్ము, ధూళి పడటం తో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము,ధూళి పీల్చ డం తో శ్వాస కోస వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
వీటికి తోడు రింగ్‌రోడ్ సెంటర్..
పే రాయి గూడెం సమీపం లో బిటి రోడ్ గుంతల మయంగా మారటం ప్రయాణం ప్రమాద భరతమైంది. వర్షాకాలం ప్రారంభం అవుతుండటం తో రోడ్ పై గుంతలో నీళ్ళు చేరి దోమలవిజయంబనకు నిలయాలుగా మారుతున్నాయి. ఇప్ప టికైనా అధికారులు త్వరతి గతిన పనులు పూర్తి చేయాలని, డివైడర్ ల పైన పెరిగిన పిచ్చి మొక్కలు, డివైడర్ పక్కన పేరుకుపోయిన మట్టి తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.